త్వరలో ప్రజా ఉద్యమం చేపడతాం – బీజేపీ చీఫ్ సోమువీర్రాజు

Monday, October 26th, 2020, 03:38:21 PM IST

ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు అధికార పార్టీ వైసీపీ మరియు టీడీపీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజధాని వివాదంపై మాట్లాడుతూ అమరావతి విషయంలో టీడీపీ, వైసీపీ కంటే బీజేపీ స్పష్టమైన వైఖరితో ఉందని రెండేళ్లలో ఇక్కడే సొంత పార్టీ కార్యాలయం కూడా ప్రారంభిస్తామని అన్నారు. అమరావతిలో తొమ్మిది వేల ఎకరాలను‌ అభివృద్ధి చేయాల్సి ఉన్నా చంద్రబాబు చేయలేదని అన్నారు. ఇక జగన్ ప్రభుత్వం కూడా గొప్పలు‌చెప్పుకోవడం తప్పా ‌చేతల్లో చూపించడం లేదని విమర్శించారు.

అయితే టీడీపీ, వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని, అప్పుడు టీడీపీ వాళ్లు, ఇప్పుడు వైసీపీ వారు అవినీతిలో భాగస్వామ్యులే అని అందుకే ఒకరిని ఒకరు ప్రశ్నించుకోవడం లేదని అన్నారు. టీడీపీ, వైసీపీ కుటుంబ పార్టీలనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వ ఎమ్మెల్యేల అవినీతిని బయట పెడతామని చెప్పుకొచ్చారు. పోలవరం విషయంలో వైసీపీ అనవసర రాద్దాంతం‌ చేస్తుందని తమకు టీడీపీ, వైసీపీ ఏనాటికి ప్రతిపక్ష పార్టీలే అని అన్నారు. ప్రజా సమస్యలపై బీజేపీ, జనసేనలు కలిసి త్వరలో ప్రజా ఉద్యమం చేపడతామని అన్నారు.