తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులకి అధికారులు గ్రీన్ సిగ్నల్

Monday, November 2nd, 2020, 08:30:02 AM IST


కరోనా వైరస్ మహమ్మారి కారణం గా ఆర్టీసి బస్సు సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం సడలింపు ఇచ్చినప్పటికీ తెలుగు రాష్ట్రాల మద్యన బస్సు సర్వీసులు పునరుద్దరణ కాలేదు. అయితే సమన్యాయం ప్రాతిపదికన రెండు రాష్ట్రాలు కిలోమీటర్లు, సర్వీసులు సమానం గా నడిపేందుకు ఒప్పందం చేసుకున్న తర్వాతే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి బస్సులు నడపాలి అని అధికారులకు సీఎం కేసీఆర్ సూచనలు ఇచ్చారు. అయితే ఎట్టకేలకు ఈ తెలుగు రాష్ట్రాల మధ్యన బస్సులు నడిపేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అయితే ఏయే మార్గాల్లో ఎన్ని సర్వీసులు నడపాలి అనే దానిపై కూడా ఒక స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇరు రాష్ట్రాల ఆర్టీసి ఎండీ లు నేడు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయనున్నారు. నేటి సాయంత్రం నుండి అంతరాష్ట్ర సర్వీసులు ప్రారంభం కానున్నాయి. అయితే లాక్ డౌన్ కి ముందు, ఇప్పుడు సర్వీసులు మరియు కిలోమీటర్లు మారిపోయాయి. ఏపీఎస్ ఆర్టీసి నుండి తెలంగాణ కి లాక్ డౌన్ ముందు 1,009 సర్వీసులన నడపగా, ఇప్పుడు ఆ సంఖ్య 638 కి పరిమితం కానుంది. అయితే టీ ఎస్ ఆర్టీసి లాక్ డౌన్ కి ముందు ఏపీ కి 750 సర్వీసులను నదపగా, ఇప్పుడు ఆ సంఖ్య 820 కి పెరగనున్నాయి. అయితే తెలంగాణ ఆర్టీసి 350 కిలోమీటర్లు అధికంగా నడపనుండగా, ఏపీ 1.12 లక్షల కిలోమటర్లు ఇప్పటివరకు అదనంగా నడిపింది. అయితే చర్చల అనంతరం ఇరు రాష్ట్రాలు సమన్యాయం సాధించడం జరిగింది.