అమ్మా బొమ్మాళీ.. నీకు పెళ్ళా?

Tuesday, May 5th, 2015, 06:44:46 PM IST

anushka45
ప్రముఖ టాలీవుడ్ అందాల తార అనుష్క త్వరలో పెళ్ళికూతురు కాబోతోందనే వార్తలు ఇప్పుడు సర్వత్రా వ్యాపిస్తున్నాయి. అయితే తాజాగా అనుష్క నటించిన రాజమౌళి దర్శకత్వంలోని ‘బాహుబలి’, గుణశేఖర్ దర్శకత్వంలోని ‘రుద్రమదేవి’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇవే కాకుండా ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్న ‘సైజ్ జీరో’ చిత్రంలో ఆమె నటిస్తూ బిజీగా ఉన్నారు.

అయితే అనుష్క ఒక వ్యక్తి ప్రేమలో పీకల్లోతు మునిగి ఉన్నారని, సదరు వ్యక్తితో ఆమె ఇటీవల దుబాయ్ వెళ్లి వారం రోజులు గడిపి తిరిగి వచ్చిందని పుకార్లు వ్యాపించాయి. అలాగే దీనికి తోడు తాజాగా అనుష్క ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ప్రేమించిన వ్యక్తినే పెళ్లాడతానని నిక్కచ్చిగా చెప్పేశారు. ఇక వీటన్నింటినీ బేరీజు వేసుకున్న సినీ అభిమానులు అనుష్క దుబాయ్ లో చట్టాపట్టాలేసుకుని తిరిగిన వ్యక్తే ఆమె లవర్ అని అతనినే త్వరలో వివాహం చేసుకోబోతోందని నిర్ణయించేశారు. మరి ఈ వార్తలే గనుక నిజమైతే త్వరలో అనుష్క పెళ్ళికూతురు కావడం, ఆమె అభిమానులు బావురుమనడం రెండూ ఖాయమే..!