రామ్ కి జోడీగా అనుపమ…ముచ్చటగా మూడోసారి?

Tuesday, November 3rd, 2020, 12:20:00 PM IST

హీరో రామ్ పోతినేని వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత స్పీడ్ పెంచేసి వరుస సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అయితే ఇటీవల రామ్ పోతినేనీ త్రివిక్రం శ్రీనివాస్ తో ఒక సినిమా చేయనున్నారు అని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీని పై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినప్పటికి, ఈ సూపర్ కాంబో పై పుకార్లు మాత్రం షికారు చేస్తున్నాయి. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరొక గాసిప్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కునున్న ఈ చిత్రం లో రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనుపమ పరమేశ్వరన్ తెలుగు లో అ ఆ చిత్రం తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. అయితే త్రివిక్రం శ్రీనివాస్ మరొకసారి అనుపమ కి ఫుల్ లెంగ్త్ హీరోయిన్ రోల్ ఇచ్చేందుకు ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. రామ్ ఇప్పటికే ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే చిత్రాల లో అనుపమ తో నటించారు. రామ్ అనుపమ కాంబో కి ప్రేక్షకులు సైతం ఫిదా అయిపోయారు. మరి ఈ కాంబో మూడోసారి పట్టాలు ఎక్కుతుందొ లేదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.