ఆ చిత్రం లో నటించడమే అను చేసిన తప్పా?

Wednesday, February 7th, 2018, 12:57:19 PM IST

అను ఇమ్మానుయేల్, ప్రస్తుతం టాలీవుడ్ కథానాయికల్లో కుర్రకారు గుండెల్లో తనదయిన ముద్రవేసిన నటి. తన మొదటి చిత్రం మజ్ను తోనే అందరి చూపు తన వైపు తిప్పుకున్నారు ఆమె. అయితే ఇప్పటివరకు ఆమె మంచి విజయాన్ని తెలుగు లో అందుకోలేదనే చెప్పాలి. ఇటీవల పవన్ కళ్యాణ్ సరసన నటించిన అజ్ఞాతవాసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరామజయం అందుకోవడంతో ఆ ప్రభావం ఆమె తదుపరి అవకాశాల పై పడుతోందని తెలుస్తోంది. అజ్ఞాతవాసి చిత్రీకరణ సమయంలోనే తన తదుపరి ఎన్టీఆర్ చిత్రం కోసం అనునే హీరోయిన్ గా తీసుకోవాలని త్రివిక్రమ్ అనుకున్నట్లు సమాచారం. అయితే ఆ చిత్రం పరాజయం పాలవడంతో ఆమె పై ప్లాప్ ముద్ర పడిందని, అది తన తదుపరి చిత్రం పై ఉండకూడదని త్రివిక్రమ్ ఆమె స్థానం లో శ్రద్ధ కపూర్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు గాని ఇప్పుడు ఇది సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయానికి సంబంధించి అధికార ప్రకటన వెలువడితే కానీ నిజా నిజాలు తెలియవని సినీ వర్గాలు అంటున్నాయి….