ఏపీ మొత్తం వారు 300 కి పైగా ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చారు… జాతీయ మీడియా ఎందుకు కవర్ చేయలేదు?

Wednesday, September 2nd, 2020, 10:37:52 PM IST

జాతీయ సంబంధిత అంశాల మీద, రాజకీయాల మీద, ఎప్పుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అన్షుల్ సాక్సేనా మరొకసారి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో చోటు చేసుకున్న అంశం పై తన గలం ఎత్తారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా 300 కి పైగా ఆక్సిజన్ సిలిండర్ల ను విరాళం గా అందజేశారు. అయితే కరోనా వైరస్ మహమ్మారి లాంటి భారీ విపత్తును మనం ఎదుర్కుంటున్న సమయం లో ఇది చాలా పెద్ద సహాయం అని, మానవతా సంజ్ఞ అని తెలిపారు.

అయితే ఇంత పెద్ద విషయాన్ని జాతీయ మీడియా ఎందుకు కవర్ చేయలేదు అంటూ సూటిగా మీడియా రంగాన్ని నిలదీశారు. అయితే ఈ సహాయం ఇంకా కొనసాగుతూనే ఉంది అని, 421 కి పైగా ఆక్సిజన్ సిలిండర్ లను అందజేశారు అని, ఇంకా విరాళం గా ఇస్తూనే ఉన్నారు అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.