ఏపీలో మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్..!

Sunday, August 23rd, 2020, 04:44:52 PM IST

ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎవరి నుంచి కరోనా సోకుతుందో ఎవరికి అర్ధం కానీ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పోలీసులు, డాక్టర్లతో పాటు ప్రజలలో ఎక్కువగా తిరిగే ప్రజాప్రతినిధులు కూడా ఈ మధ్య ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు.

అయితే అధికార పార్టీ వైసీపీ నేతలను కరోనా కలవరపెడుతుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా బారిన పడగా తాజాగానరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ప్రజలు ఎవ్వరూ అధైర్యపడవద్దని, త్వరలోనే ఆరోగ్యంతో ప్రజల ముందుకు వస్తానని అన్నారు. గత నాలుగైదు రోజుల నుంచి తనను కలిసిన వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు.