ఏపీలో మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్..!

Wednesday, December 30th, 2020, 02:10:09 AM IST


ఏపీలో కరోనా కేసులు నెమ్మదిగా తగ్గుతూ వస్తున్నా కరోనా కొత్త వైరస్ ఇప్పుడు మరింత కలవర పెడుతుంది. సామాన్య జనంతో పాటు ఇప్పటికే చాలా మంది ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారిన పడ్డారు. అయితే అధికార పార్టీ వైసీపీలో చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా బారిన పడగా తాజాగా మరో ఎమ్మెల్యేకి కరోనా సోకింది.

నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుంచి నిన్నటి వరకు పలు కార్యక్రమాలలో ఎమ్మెల్యే శిల్పా రవి పాల్గొన్నారు. దీంతో వారం రోజులుగా తనను కలిసిన ప్రతి ఒక్కరు కరోనా‌ పరీక్షలు చేయించుకోవాలని, స్వీయ నిర్బంధలో ఉండాలని పిలుపునిచ్చారు.