ఏపీ లో మరొక ఎమ్మెల్యే కి సోకిన కరోనా

Sunday, August 30th, 2020, 02:54:46 PM IST

Kothapeta-MLA-Jaggireddy

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా విలయ తాండవం చేస్తోంది. గత కొద్ది రోజులుగా పది వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం దూసుకు పోతుంది. అయితే తాజాగా అధికార పార్టీ వైసీపీ కి చెందిన ఒక ఎమ్మెల్యే కి కరోనా వైరస్ సోకింది. తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. స్వల్ప లక్షణాలు కనిపించడం తో కరోనా నిర్దారణ పరీక్షలు చేయించు కోగా కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది.

అయితే ప్రస్తుతానికి ఇంకా వ్యాధి లక్షణాలు స్వల్పంగా ఉండటం తో హోమ్ ఐశోలేశన్ లో ఉన్నారు ఎమ్మెల్యే. అయితే గత వారం రోజుల నుండి ఎమ్మెల్యే ను కలిసిన వారు,నేతలు, కార్యకర్తలు కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించు కోవాలి అని అధికారులు సూచిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇప్పటికే పలువురు నేతలు, అధికారులు కరోనా వైరస్ మహమ్మారి భారిన పడ్డారు. రోజు పది వేలకు పైగా కరోనా కేసులతో ఏపీ రాష్ట్ర ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రం లో 97,681 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్నాయి.