మరో వైసీపీ ఎమ్మెల్యే కి సోకిన కరోనా

Monday, September 28th, 2020, 03:11:17 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినా, మళ్లీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో మరొక ప్రజా ప్రతినిది, వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం కరోనా వైరస్ భారిన పడ్డారు. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పలువురు నేతలు, ఎమ్మెల్యే లు కరోనా వైరస్ భారిన పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ మేరకు ఎమ్మెల్యే ఆదిమూలం కి కరోనా వైరస్ లక్షణాలు కనిపించడం తో అధికారులు కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.

అధికారులు నిర్వహించిన కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల్లో వైసీపీ ఎమ్మెల్యే ఆది మూలం కి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే కరోనా వైరస్ పాజిటివ్ రావడం తో ఆయన తిరుపతి లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి లో కరోనా వైరస్ చికిత్స పొందుతున్నారు. అయితే ఎమ్మెల్యేను కలిసిన వారు, సన్నిహితులు కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించు కోవాలి అని అధికారులు సూచిస్తున్నారు.