బిగ్ న్యూస్: ఏపీ లో మరో ఎమ్మెల్యే కి సోకిన కరోనా!

Monday, September 21st, 2020, 05:36:35 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉంది. గత కొద్ది రోజులుగా కరోనా రాష్ట్రంలో విలయ తాండవం చేస్తోంది. పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అదే విధంగా వేల మంది ఈ మహమ్మారి భారిన పడి అనారోగ్యం బాధపడుతున్నారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో మరొక వైసీపీ ఎమ్మెల్యే ఈ మహమ్మారి భారిన పడ్డారు.

నందిగామ వైసీపీ ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు కి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. గత కొద్ది రోజుల నుండి నీరసం గా ఉండటం తో ఎమ్మెల్యే కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాల్లో కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే తన తో కొద్ది రోజుల నుండి సన్నిహితంగా ఉన్నవారు కోవిడ్19 నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలి అని సూచించారు. ప్రస్తుతం చికిత్స తీసుకున్నట్లు తెలిపారు. అయితే తనను పరామర్శించేందుకు ఫోన్ కాల్స్ కానీ, కలవడానికి కానీ ప్రయత్నించ వద్దు అని కోరారు. త్వరలో ఈ మహమ్మారి భారినుండి కోలుకొని, ప్రజల ముందుకు వస్తా అని తెలిపారు.