చైనాలో విజృంభిస్తున్న మరో వైరస్.. ఏడుగురు మృతి..!

Thursday, August 6th, 2020, 02:30:44 PM IST

ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నిటిని వణికిస్తున్న కరోనా మహమ్మారి పుట్టినిల్లు చైనా ఇప్పుడు అనేక రకాల వైరస్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఇప్పటికే కరోనా వైరస్ బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

అయితే గత కొద్ది రోజులుగా చైనాలో SFTS అనే వైరస్ విజృంభిస్తూ వస్తుంది. తూర్పు చైనాలోని జియాంగ్స్ ప్రావిన్స్‌లో జూలైలో 37 మంది, అన్‌హుయి ప్రావిన్స్‌లో 23 మందికి ఈ వైరస్ సోకగా, తాజాగా ఈ వైరస్ బారిన పడి మరో 7 మంది చనిపోయినట్టు సమాచారం. దగ్గు, జ్వరం ఈ వైరస్‌కు లక్షణాలు కాగా, శరీరంలోని ల్యూకోసైట్స్, ప్లేట్‌లెట్స్ తగ్గినట్లు వైద్యులు గుర్తించారు. 2011లోనే కనుగొన్న ఈ వైరస్ నల్లి వంటి కీటకాల ద్వారా సంక్రమిస్తున్నట్టు తేలింది.