తెలంగాణ నుంచి లీకైన మరో వీడియో..కరోనా పేషేంట్లు ఇంత దారుణ పరిస్థితుల్లో ఉన్నారా.?

Saturday, July 4th, 2020, 12:37:31 PM IST

తెలంగాణా ప్రభుత్వం వైఫల్యం ఇప్పుడు మరోసారి మిరూపితం అయ్యింది. కరోనా ప్రభావం మొదటి స్థాయిలో ఉన్నప్పుడు కేసీఆర్ చర్యలు చూసి ఆహా ఓహో ఓహో అని అన్న వారాంతా ఇప్పుడు ఓ స్థాయిలో తిట్టుకుంటున్నారు. పైకి మాటలతో జనాలని మభ్యపెడుతున్నా అసలు నిజాలు వెలికి తీసినపుడు మాత్రం ఊహించని నిజాలు బయటపడుతున్నాయి.

ముఖ్యంగా కరోనా పాజిటివ్ లెక్కలను దాచేస్తున్నారని వచ్చిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే గత కొన్ని రోజుల క్రితమే దారుణంగా ట్రీట్ చేయబడ్డ కరోనా పేషేంట్ తనకి వెంటిలేటర్ తీసేసారని తాను చనిపోతున్నా అని చివరి వీడియో పెట్టి ప్రాణాలు విడిచాడు. అయినప్పటికీ తెలంగాణా ప్రభుత్వం చర్యల్లో ఎలాంటి మార్పు పెద్దగా కనిపించలేదు.

ఇదే అనుకుంటే ఇప్పుడు గాంధీ హాస్పిటల్ లోని మరో దారుణ వీడియో బయట పడింది. అక్కడి కరోనా రోగులను ఎంత దారుణంగా చూస్తున్నారో వీడియో బయటకు వచ్చింది. ఇది చూసిన వారు తెలంగాణా ప్రభుత్వ అధికారులపై పెద్ద ఎత్తున మండి పసుతున్నారు. ఓసారి ఆ వీడియో మీరు కూడా చూడండి.