పవన్ ఖాతాలో మరో విజయం..!

Wednesday, July 8th, 2020, 07:05:03 AM IST

ఏపీ రాజకీయాల్లో మూడో ప్రత్నామ్యయం గా వచ్చిన జనసేన పార్టీ ఎన్నికలలో ఊహించిన స్థాయి ఫలితాన్ని అందుకోకపోయినా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకు రావడంలో మాత్రం ఖచ్చితంగా విజయం సాధించింది అని చెప్పాలి.

కేవలం ఇప్పుడు అనే కాకుండా పవన్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా గత ప్రభుత్వం లో అనేక సమస్యలు పవన్ వలనే వెలుగులోకి వచ్చి ఒక పరిష్కార దిశగా వెళ్లాయి. అలాగే ఇప్పుడు కూడా కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో జనసేన పార్టీ తనదైన పాత్ర పోషిస్తుంది.

ఇటీవలే పదో తరగతి పరీక్షల అంశాన్ని మొదటగా చర్చకు తీసుకొచ్చి కీలక పాత్ర వహించారు. అలాగే మొన్న జూలై 5వ తారీఖున తన దృష్టికి వచ్చిన లాయర్ల సమస్యను లెవనెత్తగా దానికి సంబంధించిన జీవో ను విడుదల చేసి వారికి ఇచ్చిన మాట ప్రకారం నిలిపివేసిన ఆర్ధిక సాయాన్ని పునరుద్ధరించారు. షో ఇది మాత్రం ఖచ్చితంగా పవన్ ఖాతాలో పడాల్సిన విజయమే అని చెప్పాలి.