శంకర్ – రామ్ చరణ్ సినిమా పై మరొక క్రేజీ అప్డేట్!?

Friday, March 12th, 2021, 09:33:15 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుదిరం లో నటిస్తున్నారు. అంతేకాక తండ్రి ఆచార్య చిత్రం లో కూడా ఒక కీలక పాత్ర లో పోషిస్తున్నారు. అయితే ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజమౌళి దర్శకత్వంలో చేసిన అనంతరం రామ్ చరణ్ ఎలాంటి సినిమా చేస్తారా అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే వీరిద్దరి కలయిక లో వస్తున్న చిత్రం పొలిటికల్ డ్రామా గా ఉండనున్నట్లు సమాచారం.

అయితే రామ్ చరణ్ తో ఈ ఏడాది జూలై లో సినిమా షూటింగు మొదలు పెట్టనున్నారు. ప్రస్తుతం శంకర్ స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. మరొకసారి దిల్ రాజుకు మరియు రామ్ చరణ్ ఇద్దరి కి పూర్తి స్క్రిప్ట్ వినిపించిన అనంతరం సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా లో కియార అద్వానీ లేదా రష్మిక మండన్న లలో ఒకరు హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని పై త్వరలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే మరొక విషయం ఏమిటంటే ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కించనున్నారు.