కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు మృతి కేసులో మరో కొత్త ట్విస్ట్ నెలకొంది. కోటి 10 లక్షల లంచం కేసులో నిందితుడిగా ఉన్న నాగరాజును నెలరోజులుగా ఏసీబీ విచారించింది. ఈ క్రమంలోనే ఇటీవల చంచలగూడ జైలులో ఆయన ఉరివేసుకుని చనిపోయిన ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తన భర్తను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని నాగరాజు భార్య స్వప్న ఆరోపించింది. తాము వెళ్లేలోపే మృత దేహాన్ని తీసేసి ఆధారాలు లేకుండా చేశారని చంచల్‌గూడ జైలర్‌పై అనుమానం ఉందని స్వప్న అనుమానం వ్యక్తం చేసింది.
అయితే తన భర్త నాగరాజుది ముమ్మాటికీ హత్యే అని భావిస్తున్న స్వప్న, ఆయన కుటుంబసభ్యులు హెచ్ఆర్సీని ఆశ్రయించారు. నాగరాజు మృతి విషయంలో ఏసీబీ తీరుపై కుటుంబ సభ్యులు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. నాగరాజు మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని, తప్పుడు కేసులు పెట్టిన ఏసీబీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే చివరిసారిగా తన కుటుంబ సభ్యులతో వీడియో కాల్ మాట్లాడిన నాగరాజు నేను ఏ తప్పు చేయలేదని, అన్నీ ప్రాపర్‌గానే ఉన్నాయని, రికార్డ్స్ పరిశీలించాకే చేశామని అన్నారు. యిల్‌పై బయటకు వచ్చాక కోర్టులో చూసుకుందామని కుటుంబ సభ్యులకు ఆయన భరోసా ఇచ్చారని వార్తలు వచ్చాయి.