తెలంగాణలో మరో టీఆర్ఎస్ ఎంపీ కి సోకిన కరోనా వైరస్!

Wednesday, November 11th, 2020, 02:06:22 PM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే ఇన్ని నెలలు గడుస్తున్నా దీని తీవ్రత ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. అయితే ఇప్పటికే పలువురు ప్రముఖులు, సినీ రంగానికి చెందిన వారికి, రాజకీయ నాయకులకి కరోనా వైరస్ సోకి కోలుకున్న వారు చాలామంది ఉన్నారు. అయితే తాజాగా మరొక ఎంపీ కి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది.

అధికార పార్టీ తెరాస కి చెందిన కీలక నేత, ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి కరోనా వైరస్ మహమ్మారి భారిన పడ్డారు. నిన్న ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకున్న ఈయన కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించు కున్నారు. అయితే ఈ ఫలితాల్లో కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఎంపీ సురేష్ రెడ్డి హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. అయితే తనను ఇటీవల కలిసిన వారు, సన్నిహితంగా ఉన్నవారు మొత్తం కూడా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించు కోవాలి అని సూచించారు.