మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్..!

Monday, August 3rd, 2020, 03:59:40 PM IST

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండగా, కరోనా బారిన పడుతున్న ఎమ్మెల్యేల జాబితా కూడా క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గొంగిడి సునీత, బాజిరెడ్డి గోవర్ధన్, గణేశ్ గుప్తా, జీవన్ రెడ్డితో పాటు, మంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌లకు కరోనా సోకగా తాజాగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు కూడా కరోనా సోకింది.

అయితే సింగరేణి వనమహత్సోవంలో పాల్గొన్న ఎమ్మెల్యే, మేయర్‌కు కరోనా లక్షణాలు కనిపించడమంతో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ పైవేటు ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఇక రామగుండం మేయర్ గతవారం రోజులుగా హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు.