టీఆర్ఎస్‌కు మరో షాక్.. గుండెపోటుతో మరో నేత కన్నుమూత..!

Wednesday, December 2nd, 2020, 05:31:02 PM IST

గత కొద్ది రోజుల నుంచి టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు వరుసగా కన్నుమూస్తున్నారు. తాజాగా నేడు నర్సంపేట జిల్లా అధ్యక్షుడు నాయని నర్సయ్య గుండెపోటుతో చనిపోయారు. నర్సయ్యకు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా ఆయన అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నర్సయ్య కీలక పాత్ర పోశించారు.

ఇదిలా ఉంటే ఈ ఏడాది టీఆర్ఎస్ పార్టీ పలువురు కీలక నేతలను కోల్పోయింది. మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య లాంటి నేతలు కన్నుమూశారు. అయితే నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చనిపోయిన తర్వాత రోజే మరో నేత నాయని నర్సయ్య కూడా చనిపోవడంతో టీఆర్ఎస్ పార్టీ నేతల్లో తీవ్ర విషాదం నెలకొంది.