బిగ్ బ్రేకింగ్ : తెలంగాణలో కరోనా కల్లోలం..మరోసారి రికార్డు కేసులు.!

Sunday, July 5th, 2020, 09:56:56 PM IST


కరోనా దెబ్బకు ఎన్నడూ లేని విధంగా తెలంగాణా సీఎం కేసీఆర్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందని చెప్పాలి. కేవలం మాటల్లో మాత్రమే కోటలు కట్టి నిజ జీవితంలో మాత్రం ఎలాంటి వేగవంతమైన చర్యలు చేయకపోవడం పెద్ద మైనస్ అయ్యింది. దీనితో కెసీఆర్ సర్కార్ కెరీర్ లొనే ఇది అతిపెద్ద వైఫల్యం గా నిలిచింది అని చెప్పాలి.

దీనితో అక్కడ కరోనా కేసులు భారీ ఎత్తున నమోదు అవుతున్నాయి. పరీక్షల సంఖ్య పెంచడంతో పాజిటివ్ కేసులు కూడా వస్తుండటంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు తెలంగాణ లో గత 24 గంటల్లో నమోదు కాబడ్డ కేసుల వివరాలను వారు వెల్లడించారు.

గత 24 గంటల్లో మొత్తం 5 వేల 290 శాంపిల్స్ ను పరీక్షించగా భారీ ఎత్తున మొత్తం 1590 కేసులు నమోదు కాగా ఒక్క జి హెచ్ ఎం సి పరిధిలో భారీ స్థాయిలో 1277 కేసులు నమోదు అయ్యాయి. అలాగే 7 మరణాలు సంభవించాయని ఈరోజు బులిటెన్ ద్వారా తెలిపారు. మరి తెలంగాణా లో పరిస్థితులు ఎప్పుడు కుదుట పడతాయో చూడాలి.