బిగ్ న్యూస్ : తెలంగాణాలో మరోసారి రికార్డు స్థాయి కేసులు..ఆ మూడు చోట్ల భారీ పెరుగుదల.!

Wednesday, August 5th, 2020, 09:44:50 AM IST

ఇప్పుడు దేశ వ్యాప్తంగా కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతుండగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉందని చెప్పాలి. ఇక్కడ తక్కువ టెస్టులు చేస్తే కేసులు తక్కువగాను టెస్టులు ఎక్కువ చేస్తే ఎక్కువ గాను వస్తున్నాయి.

అలా ఇప్పుడు తాజాగా తెలంగాణలో నమోదు అయిన లేటెస్ట్ లెక్కలను రాష్ట్ర ప్రభుత్వం వారు విడుదల చేసారు. గత 24 గంటల్లో 21 వేల 118 శాంపిల్స్ పరీక్షించగా అందులో భారీగా 2012 కేసులు నమోదు అయ్యినట్టుగా నిర్ధారణ అయ్యింది.

అలాగే గత 24 గంటల్లోనే 1139 మంది పూర్తిగా రికవర్ కాగా 13 మంది మరణించారు. అయితే ఈ భారీ కేసుల సంఖ్యలో జిహెచ్ఎంసి పరిధిలో 532 కేసులు మరోసారి మేడ్చల్ లో భారీ ఎత్తున 198 కేసులు అలాగే రంగారెడ్డి లో 188 కేసులు భారీ ఎత్తున నమోదు అయ్యాయి. దీనితో తెలంగాణాలో మొత్తం కేసులు 70 వేల 958 కేసులు నమోదు అయ్యినట్టుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వారు తెలిపారు.