బిగ్ బ్రేకింగ్ : ఏపీలో మరోసారి భారీ ఎత్తున రికార్డు స్థాయి కరోనా కేసులు..!

Thursday, July 2nd, 2020, 02:26:26 PM IST

ప్రస్తుతం ఏపీలో కరోనా పరిస్థితులు ఏమాత్రం చక్కబడడం లేదని చెప్పాలి. గత కొన్నాళ్ల నుంచి ఏపీలో భారీ ఎత్తున నమోదు కాబడుతున్న కేసులు గ్రాఫ్ కాస్త చిత్రంగా మారింది అని చెప్పాలి. గత రెండు రోజులు ఏపీలో స్వల్పంగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఇప్పుడు మరో సారి భారీ ఎత్తున కరోనా కేసులు పెరిగాయి.

గడిచిన 24 గంటల్లో కేవలం 14 వేల 285 శాంపిల్స్ మాత్రమే పరీక్షించగా ఈసారి ఏకంగా ఒక్క ఆంధ్రా లొనే 812 కేసులు నమోదు అయ్యాయి. అలాగే ఇతర దేశాలు మరియు రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి 845 కు ఈ మార్క్ చేరుకుంది. దీనితో ఏపీలో మొత్తం బాధితులు సంఖ్య 13 వేల 625 కు చేరుకుంది.

గత రెండు రోజులలో తగ్గింది అనుకున్న కరోనా కేసులు మళ్లీ ఈ స్థాయిలో ఒక్కసారిగా పెరగడం ఊహాతీతం. ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో 281 మంది డిశ్చార్జ్ కాగా ఐదుగురు మరణించినట్టుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వారు వెల్లడించారు.