బిగ్ న్యూస్ : మరో ముగ్గురు వైసీపీ నేతలకు కరోనా పాజిటివ్.!

Wednesday, August 5th, 2020, 04:20:43 PM IST

ఏపీ రాజకీయ నాయకులు కూడా కరోనా బారిన పడుతున్న వార్తలు ఈ మధ్యన మనం వింటూనే ఉన్నాం. అటు తెలంగాణా రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ దెబ్బకు చాలా మంది ప్రజా ప్రతినిధులే ఆసుపత్రి పాలయ్యారు. అయితే ఏపీలో మాత్రం ప్రజా ప్రతినిదులు కరోనా కోసం అంత చేసాం ఇంత చేశామని చెప్తున్నారు కానీ వారికి కానీ కరోనా వస్తే అంతా హైదరాబాద్ కే పరుగులు తీస్తున్నారు. ఇటీవలే వైసీపీకు చెందిన కీలక నేతలు పలువురికి కరోనా పాజిటివ్ వచ్చిన వచ్చిన సంగతి తెలిసిందే.

వారిలో కొందరు పూర్తిగా కోలుకున్నారు కూడా. అయితే ఇప్పుడు వైసీపీకు చెందిన ఓ ఇద్దరు ఎమ్మెల్యేలు మరియు మంత్రికి కరోనా సోకినట్టు తెలుస్తుంది. ఏపీ అటవీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కి కరోనా పాజిటివ్ రాగా అలాగే గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు మరియు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం లకు పాజిటివ్ వాచినట్టు తెలుస్తుంది. వీరిలో అన్నా రాంబాబు మాత్రమే ఒంగోలులోని రాష్ట్ర వైద్యం తీసుకుంటున్నారు. మిగతా వారు అంతా హైదరాబాద్ లోనే చికిత్స పొందుతున్నారు.