టీడీపీకి మరో షాక్.. నేడు వైసీపీలో చేరనున్న కీలక నేత..!

Monday, August 10th, 2020, 08:00:20 AM IST

TDP_1706

ఏపీలో అధికారం కోల్పోయినప్పటి నుంచి టీడీపీకి వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది సీనియర్ నేతలు టీడీపీనీ వీడిపోవడంతో బాగా చతికిలపడిన ఆ పార్టీకి తాజాగా మరో షాక్ తగలబోతుంది.

కాకినాడ జిల్లా టీడీపీ పార్టీ నాయకుడు చలమలశెట్టి సునీల్‌ నేడు సీఎం జగన్‌ సమక్షంలో మళ్లీ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో టీడీపీ తరఫున పోటీ చేసి వైసీపీ ఎంపీ వంగా గీత చేతిలో ఈయన పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత టీడీపీకి కాస్త దూరంగా ఉంటున్నారు. అయితే 2022లో రాజ్యసభకు ఖాళీ అవుతున్న ఓ ఎంపీ స్థానంలో అవకాశం కల్పించడానికి అధికార పార్టీతో ఇటీవల ఆయన మంతనాలు జరిపారని సీఎం జగన్ కూడా సానుకూలంగా స్పందించడంతో నేడు ఆయన వైసీపీలో చేరుతున్నారు.