ఏపీలో మరో దారుణం..దళిత వ్యక్తిపై పోలీసు బూటు కాలితో దాడి.!

Wednesday, August 5th, 2020, 11:19:00 AM IST

ఊహించని విధంగా గత కొన్ని రోజుల నుంచి ఏపీలో దళితులపై అమానుష దాడులు పెరిగిపోతున్నాయి. అధికార పక్షం ఏదో చెప్తుంది కానీ వారిపై దాడులు మాత్రం ఎంతకూ తగ్గడం లేదు. తాజాగా ఇప్పుడు మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏపీ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా చెప్పిన ఫ్రెండ్లీ పోలీసే సాయం అని వచ్చిన దళిత వ్యక్తిని బూతు కాలితో తన్నిన వైనం బయటపడింది.

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం, టెక్కలి ప్రాంతానికి చెందిన జగన్ అనే వ్యక్తి తన ఇంటి పట్టా విషయంలో తన తల్లితో కలిసి పోలీసు వద్దకు వెళ్లగా అతన్ని అక్కడి రాజకీయ నాయకుల ప్రోద్బలంతో పోలీసు అతన్ని బూటు కాలితో తన్ని చేత్తో కొట్టాడు. ఈ దారుణ వీడియో ఘటనను చూసి టీడీపీ అధినేత చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారు.

“ఓ దళిత వ్యక్తిని వైఎస్సార్సీపీ నాయకుల సూచనల మేరకు దాడి చెయ్యడం షాక్ కలిగించిందని, అతన్ని కాపాడుకోవడానికి అతని తల్లి అడ్డుకున్నా సరే వారు ఆగలేదని, ఏపీలో ఈ వైసీపీ దుశ్చర్యలు మరియు వారి పిచ్చి ఎప్పుడు తగ్గుతుంది” అని సంచలన ట్వీట్ పెట్టారు. ఇప్పుడు ఈ సంచలన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.