జగన్ సర్కార్‌కు షాక్.. ఆ బిల్లును సవాల్ చేస్తూ హైకోర్ట్‌లో పిటీషన్..!

Monday, August 3rd, 2020, 10:00:31 AM IST

ఏపీ సీఎం జగన్‌కు రాజధాని రైతు పరిరక్షణ సమితి సభ్యులు షాక్ ఇచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో జగన్ సర్కార్ తీసుకొచ్చిన పాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఎ రద్దు బిల్లులను రాజధాని రైతులు ముందు నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఇటీవల మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో విశాఖకు రాజధానిని తరలించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే తాజాగా పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాజధాని రైతు పరిరక్షణ సమితి సభ్యులు హైకోర్ట్‌లో పిటీషన్ దాఖలు చేశారు. గెజిట్ అమలును నిలిపివేసి స్టే ఇవ్వాలని కోరారు. రాజ్‌భవన్, సీఎం కార్యాలయం, సచివాలయం, పోలీస్ శాఖల కార్యాలయాలను అమరావతి నుంచి తరలించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటీషన్‌లో పేర్కొన్నారు.