బిగ్ న్యూస్ : కరోనా విషయంలో బయటపడ్డ మరో సంచలన నిజం.!

Thursday, July 23rd, 2020, 12:02:31 PM IST

Corona

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మూలన ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో మనం ప్రతీరోజూ వింటూనే ఉన్నాము. అంతకంతకు కరోనా తీవ్రత ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతూనే ఉంది కానీ తగ్గే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. మన దేశంలో అయితే ఇప్పుడు రికవరీ రేటు బాగానే ఉంది కానీ వాక్సిన్ వచ్చే లోపు ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో అన్నది తెలియడం లేదు.

ఇదిలా ఉండగా దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు బాంబు పేల్చారు. కరోనా వైరస్ కేవలం బయట తిరగడం వలన మాత్రమే కాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉందని అంటున్నారు. అలా పది మందిలో ఒకరికి ఇంటి సభ్యుని వల్లే కరోనా సోకుతుందని వారు నిర్ధారించారు.

పైగా వారిలో కరోనా ఉన్నప్పటికీ మిగతా వారికి సోకినా అంత తొందరగా బయటపడడం లేదని వారు తెలిపారు. ఇక నుంచి ఇళ్లలో కూడా మాస్కులు వేసుకొని తిరిగితే మంచిది అని వారు అంటున్నారు. మొత్తానికి మాత్రం ఈ కరోనా పీడ ఎప్పుడు వదులుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు.