టీడీపీ నేత అంకులు కుటుంబంలో మరో విషాదం.. బావమరిది మృతి..!

Monday, January 4th, 2021, 08:50:34 PM IST

గుంటూర్ జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్, టీడీపీ నేత పురంశెట్టి అంకులును నిన్న గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. కత్తులతో పొడిచి, మెడకోసి మరీ ఆయనను చంపేశారు. అయితే ఈ ఘటన నుంచి ఇంకా కుటుంబ సభ్యులు తేరుకోకముందే ఆ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. అంకులు హత్య నేపథ్యంలో తీవ్ర మనోవేదనకు గురైన అంకులు బావమరిది శ్రీనివాస్‌ స్పృహ కోల్పోయారు. స్పృహ కోల్పోయిన కొద్దిసేపటికే ఆయన మృతి చెందారు. అయితే ఈ ఇద్దరి ఇద్దరి మరణంతో పెదగార్లపాడు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.