కేజీఎఫ్ చాప్టర్ 2 టీజర్ కి కౌంట్ డౌన్ స్టార్ట్…మరొక మాస్ పోస్టర్ విడుదల

Monday, January 4th, 2021, 12:59:31 PM IST

సౌత్ నాట సంచలనం సృష్టించిన కేజీఎఫ్ చిత్రం కి సంబంధించిన సీక్వెల్ పార్ట్ 2 విడుదల కి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన పలు పోస్టర్లు విడుదల కాగా, మరొక పోస్టర్ ను సోమవారం నాడు విడుదల చేసింది చిత్ర యూనిట్. మాస్ లుక్ తో హీరో యశ్ అద్దరగొట్టాడు. ఈ చిత్రం లో యశ్ రాకీ భాయ్ గా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ యశ్ పుట్టిన రోజున జనవరి 8 విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.

అయితే యశ్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు పోస్టర్ ను షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం లో యశ్ కి దీటుగా సంజయ్ దత్ అదీరా పాత్రలో నటిస్తున్నారు. రవీనా టాండన్, రావు రమేష్, పలువురు ప్రముఖులు ఈ చిత్రంలో కీలక పాత్ర లు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో యశ్ సరసన కథానాయికగా శ్రీనిధి శెట్టి నటిస్తుండగా, దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ మూవీ గా తెరకెక్కిస్తున్నారు.