కరోనా టీకా వికటించి అంగన్ వాడి కార్యకర్త మృతి

Wednesday, February 10th, 2021, 12:45:43 PM IST

ప్రపంచ దేశాలను తీవ్ర భయాందోళనలకు గురి చేసిన కరోనా వైరస్ మహమ్మారి కి భారత్ వాక్సిన్ అందుబాటులోకి తీసుకు వచ్చింది. రెండు వాక్సిన్ లు కోవాగ్జీన్ మరియు కోవిశీల్డ్ లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. వాక్సినేషన్ ప్రక్రియ దేశ వ్యాప్తంగా శరవేగంగా కొనసాగుతుంది. అయితే తల నొప్పి, జ్వరం, కళ్ళు తిరగడం లాంటివి కొంచెం వాక్సిన్ వేసుకున్న తర్వాత రావడం జరిగినా, పలు చోట్ల వాక్సిన్ వికటించి ప్రాణాలు కోల్పోవడం చూస్తున్నాం. తాజాగా ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం నందిపాడు గ్రామానికి చెందిన పద్దం చిన్ని అంగన్ వాడి కార్యకర్త గా పని చేస్తోంది. అయితే నాలుగు రోజుల క్రితం అంగన్ వాడి టీచర్ కరోనా వేయించుకున్నారు.

అయితే అప్పటి నుండి జ్వరం, వాంతులు, విరోచనాల తో తీవ్ర అశ్వస్తకు గురి అయింది. అయితే కుటుంబ సభ్యులు అప్పటికే స్థానిక వైద్యం అందించినా పరిస్తితి విషమించడంతో ఖమ్మం కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం నాడు తెల్లవారుఝామున తుదిశ్వాస విడిచారు. అయితే టీకా వికటించడంతో ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు అంటున్నారు. అయితే అందుకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది.