కరోనా సోకి మరొక ఎంపీ మృతి

Wednesday, December 2nd, 2020, 08:41:09 AM IST

కరోనా వైరస్ మహమ్మారి ఏ ఒక్కరినీ విడిచి పెట్టడం లేదు. అయితే దేశ వ్యాప్తంగా దీని ప్రభావం తగ్గినా, ఇంకా పూర్తి స్థాయిలో తగ్గలేదు. తాజాగా కరోనా వైరస్ మహమ్మారి భారిన పడి మరొక ఎంపీ కన్నుమూశారు. గుజరాత్ కి చెందిన బీజేపీ రాజ్యసభ ఎంపీ అభయ్ భరద్వాజ్ కరోనా వైరస్ కారణంగా ప్రాణాలను కోల్పోయారు. ఈ ఏడాది ఆగస్ట్ లో కరోనా వైరస్ భారిన పడిన ఈయన రాజ్ కోట లోని ఆసుపత్రి లో చికిత్స పొందారు. అయితే ఊపిరి తిత్తుల సమస్య తలెత్తడంతో చెన్నైలోని ఒక ఆసుపత్రి కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుది శ్వాస విడిచారు. ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ అహ్మద్ పటేల్ కరోనా వైరస్ తో ప్రాణాలను కోల్పోయారు. ఒక్క వారం లో గుజరాత్ కి చెందిన ఇద్దరు రాజ్యసభ ఎంపీ లను కోల్పోవడం పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.