తెలంగాణలో మరో ఎమ్మెల్యే కి సోకిన కరోనా

Thursday, November 5th, 2020, 09:30:14 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే ఈ నేపథ్యం లో సినీ ప్రముఖుల నుండి ఇటు రాజకీయ నాయకులను సైతం ఈ మహమ్మారి విడిచి పెట్టడం లేదు. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రం లో మరొక ఎమ్మెల్యే కి కరోనా వైరస్ సోకింది. అయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కరోనా వైరస్ భారిన పడిన విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం హోమ్ క్వరాంటైన్ లో ఉన్న విషయాన్ని వెల్లడించారు.

తాను, తన భద్రతా సిబ్బంది కరోనా వైరస్ భారిన పడ్డామని, అయితే ఆరోగ్యం గానే ఉన్నాం అని, అయినప్పటికీ హోమ్ క్వారంటైన్ లో ఉన్న విషయాన్ని వెల్లడించారు. అయితే ఇటీవల తనను కలిసిన వారు, సన్నిహితంగా ఉన్నవారు అంతా కూడా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించు కోవాలి అని సూచించారు. అయితే తన ఆరోగ్యం గురించి ఆందోళన చెండవద్దు అని కోరారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తుండగా పలువురు మంత్రులు, నేతలు, ఎమ్మెల్యే లు కరోనా వైరస్ భారిన పడి కోలుకున్నారు.