ఫ్లాష్ న్యూస్: మరొక మంత్రికి సోకిన కరోనా

Friday, September 25th, 2020, 07:54:47 PM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. కరోనా వైరస్ భారిన పడి రాజకీయ నేతలు కూడా తీవ్ర అనారోగ్యం పాలు అవుతున్నారు. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా కరోనా వైరస్ సోకుతూనే ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యే లు, ఈ మహమ్మారి భారిన పడ్డారు. అయితే తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సువెందు కి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది.

కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల్లో పాజిటివ్ అని తేలడం తో ప్రస్తుతం ఆయన హోమ్ ఐసొలేశన్ లో ఉన్నారు. అయితే తన తల్లికి కూడా కరోనా వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. అయితే మంత్రి ను తాజాగా కలిసిన వారు, సన్నిహితులు కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించు కోవాలి అని అధికారులూ సూచిస్తున్నారు. బెంగాల్ లో ఇప్పటి వరకు రెండు లక్షల ముప్పై ఏడు వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, 4,600 కి పైగా కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోయారు.