కరోనా చికిత్స పొందుతూ మృతి చెందిన మరొక మంత్రి

Friday, October 16th, 2020, 12:34:47 PM IST

కరోనా వైరస్ చేస్తున్న విలయ తండవానికి రోజుకి వందల సంఖ్యలో బాధితులు ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే ఇదే తరహాలో జనతాదళ్ సీనియర్ నేత, బీహార్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కపిల్ డియో కామత్ కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కరోనా వైరస్ సోకడం తో గత కొద్దీ రోజులుగా పాట్నా లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యం అంతకంతకూ క్షీణించడం తో శుక్రవారం నాడు ఉదయం ఆయన మృతి చెందారు. అయితే కరోనా వైరస్ సోకి మృతి చెందడం తో ఆయన మృతి పట్ల పలువురు నేతలు, ప్రముఖులు, రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి బాధాకరం అని, రాజకీయాల్లో ఆయన లేని లోటు తీర్చ లేనిది అని వ్యాఖ్యానించారు.