మెగా కుటుంబంలో కరోనా కలకలం.. వరుణ్‌తేజ్‌కు కూడా పాజిటివ్..!

Tuesday, December 29th, 2020, 06:56:07 PM IST

కరోనా మహమ్మారి సామాన్యులనే కాదు రాజకీయ నాయకులను, సెలబ్రెటీలను కూడా విడిచిపెట్టడం లేదు. ఓ పక్క కరోనాకు వ్యాక్సిన్ వస్తుందని ప్రచారం జరుగుతున్నా మరో పక్క కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మెగా కుటుంబంలో కరోనా కలకలం రేపుతోంది. ఈ రోజు ఉదయం రామ్ చరణ్ తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ప్రకటన రిలీజ్ చేశాడు.

అయితే తాజగా మరో మెగా హీరో వరుణ్‌తేజ్ కూడా తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలియచేశాడు. ఈ రోజు ఉదయం నాకు కరోనా పాజిటివ్‌ అని తేలిందని, స్వల్ప లక్షణాలు ఉన్నాయి. ప్రస్తుతం నేను హోం క్వారంటైన్‌లో ఉంటూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని, త్వరలోనే తాను మళ్లీ కోలుకుంటానని, తన మీద ప్రేమ చూపించే ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఇటీవల మెగా ఫ్యామిలీలో అందరూ కలిసి క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. రామ్ చరణ్, వరుణ్ తేజ్ ఇద్దరికీ కరోనా రావడంతో మెగా కుటుంబంలో మిగిలిన వారిలో కూడా టెన్షన్ మొదలయ్యింది.