మరింత పవర్ఫుల్ గా సిద్దం చేస్తున్న కేజీఎఫ్2

Wednesday, January 6th, 2021, 04:27:05 PM IST

కేజీఎఫ్ చిత్రం తో ప్రశాంత్ నీల్ కన్నడ సినిమా క్రేజ్ ను ఎంతో పైకి తీసుకు పోయారు. అయితే ఇందుకు వస్తున్న సీక్వెల్ ను అంతకు మించి సిద్దం చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను జనవరి 8 న యశ్ పుట్టిన రోజున ఉదయం 10:18 గంటలకు విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అందుకోసమే టీజర్ విడుదల కూడా చిత్ర యూనిట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఈ చిత్రం కి సంబంధించిన సరి కొత్త పోస్టర్ లను విడుదల చేస్తూ, అందుకు సంబంధించిన విశేషాలను వెల్లడిస్తూ ఇంకా ఆసక్తి రేపుతోంది.

అయితే బుధవారం నాడు చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్ పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదీరా పాత్రకి సంబంధించిన పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సింహం ఉంగరం తో కత్తి పట్టుకొని ఉన్నారు సంజయ్ దత్. అయితే యశ్, రవీనా టాండన్, సంజయ్ దత్ ల సరికొత్త పోస్టర్ ల స్ట్రాటజీ తో టీజర్ మొత్తం కూడా హై ఓల్టేజ్ తో ఉండనున్నట్లు తెలుస్తోంది. అంతేకాక కేజీఎఫ్ టైమ్స్ అంటూ విడుదల చేస్తున్న పోస్టర్లు సైతం ఈ సినిమా పై ఆసక్తి ను పెంచేలా చేస్తున్నాయి. ఈ చిత్రం లో యశ్ సరసన శ్రీనిధి శెట్టి కథానాయిక గా నటిస్తుండగా, సంజయ్ దత్ విలన్ పాత్ర లో నటిస్తున్నారు. రావు రమేష్, రవీనా టాండన్ లతో పాటుగా పలువురు ప్రముఖులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. పాన్ ఇండియన్ మూవీ గా రాబోతున్న ఈ చిత్రం సమ్మర్ కి విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.