అఖిలప్రియ కేసులో మరో కీలక ట్విస్ట్.. నిందితులుగా మరికొందరు..!

Thursday, January 14th, 2021, 11:44:38 PM IST

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మరో కీలక ట్విస్ట్ ఏర్పడింది. ఈ కేసులో భూమా అఖిలప్రియ పేరునే కాకుండా మరికొంత మంది పేర్లను కూడా పోలీసులు నిందితులుగా చేర్చారు. భూమా జగత్‌ విఖ్యాత్‌, భార్గవ్ తమ్ముడు చంద్రహాస్, భార్గవ్ కుటుంబ సభ్యులను నిందితులుగా చేర్చారు. కిడ్నాప్ ప్లాన్ నుంచి నిందితులు పారిపోయే వరకు భార్గవ్ ఫ్యామిలీ సాయం చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించినట్టు తెలుస్తుంది.

ఇక ఈ కేసులో ఏ1 నిందితురాలిగా ఉన్న భూమా అఖిలప్రియ మూడు రోజుల పోలీసుల కస్టడీ ముగిసింది. కస్టడీ ముగిసిన వెంటనే ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కరోనా పరీక్షల్లో ఆమెకు నెగిటివ్ వచ్చింది. దీంతో ఆమెను జడ్జి ఎదుట హాజరుపర్చగా కోర్టు ఆమెకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో అఖిలప్రియను మళ్ళీ చంచల్‌గూడ జైలుకు తరలించారు.