తెలుగు దేశం పార్టీ కి మరొక షాక్…వైసీపీ లో చేరిన మరొక కీలక నేత!

Tuesday, September 1st, 2020, 01:17:31 AM IST


తెలుగు దేశం పార్టీ కి మరొక షాక్ తగిలింది. ఇప్పటికే పార్టీ కి చెందిన పలువురు నేతలు వైసీపీ లో చేరడం జరిగింది. తాజాగా చలమలశెట్టి సునీల్ వైసీపీ లో చేరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున కాకినాడ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయగా, వైసీపీ కి చెందిన వంగా గీతా చేతిలో ఓటమిని చవి చూశారు. అయితే తాజాగా ఈయన వైసీపీ లో చేరడం పట్ల ఆ పార్టీ కి చెందిన నేతలు షాక్ కి గురి అవుతున్నారు.

అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో చలమల శెట్టి సునీల్ పార్టీ లో చేరడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం లో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రి కురసాల కన్నబాబు, మంత్రి వేణుగోపాల కృష్ణ, ఎంపీ వంగా గీతా, పలువురు ఎమ్మెల్యే, వైసీపీ నేతలు సమక్షం లో చేరడం జరిగింది. అయితే ఇప్పటికే తెలుగు దేశం పార్టీ కి చెందిన కీలక నేతలు వైసీపీ లో చేరగా, ఇంకా పలువురు పార్టీ ను మారే అవకాశం ఉంది అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజా పరిణామాల తో టీడీపీ లో ఆందోళన మొదలైంది అని కొందరు భావిస్తున్నారు.