రిపబ్లిక్ డే రోజు దాడులు చేస్తామంటూ హెచ్చరిక!

Friday, January 16th, 2015, 03:04:33 PM IST


ముంబై ఛత్రపతి శివాజీ విమానాశ్రయంపై గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా దాడి చేస్తామని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ మరోసారి హెచ్చరించింది. ఈ మేరకు ముంబై ఎయిర్ పోర్టులోని స్నానాల గదిలో ఈ లేఖలు కనిపించాయి. ఇక రిపబ్లిక్ డే రోజున దాడులు చెయ్యబోతున్నట్లు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు లేఖలో పేర్కొన్నారు. దీనితో అప్రమత్తమైన అధికారులు విమానాశ్రయంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తూ గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.

కాగా ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం టెర్మినల్ 2 లోని లెవెల్ 2 టాయిలెట్ లో దాడులు చేస్తామంటూ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు చేతి రాతతో రాసిన నోట్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా టాయిలెట్ గోడకు తగిలించి ఉన్న ఆ నోట్ లో ‘ఎటాక్ బై ఐఎస్ఐఎస్ డేట్ 10/01/2015’ రాసి గోడలకు అంటించిన తీవ్రవాదులు ఇప్పుడు అదే తరహాలో మరోసారి హెచ్చరికలను జారీ చేశారు.