మహేష్ “సర్కారు వారి పాట” లో రేణు దేశాయ్!?

Monday, January 4th, 2021, 03:53:56 PM IST

వరుస సినిమాలు చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రం కి సంబంధించిన మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అభిమానులు సర్కారు వారి పాట హ్యాశ్ ట్యాగ్ ను విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఈ చిత్రం లో సూపర్ స్టార్ మహేష్ బాబు కి వదిన పాత్ర లో పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయిన రేణు దేశాయ్ నటించనున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే దర్శకుడు పరశురామ్ రేణు దేశాయ్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఇటీవల రేణు దేశాయ్ సైతం ఒక ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు లో సినిమాలు చేసేందుకు ఆసక్తి ఉన్న విషయాన్ని వెల్లడించారు. అయితే మహేష్ బాబు సైతం ప్రతి సినిమాలో ఒక లేడీ పవర్ ఫుల్ పాత్రను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సరీలేరు నీకెవ్వరూ చిత్రం లో ప్రముఖ నటి విజయశాంతి ను ఎంచుకొగా, ఇప్పుడు రేణు దేశాయ్. బ్యాంక్ స్కాం ల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై కేవలం ప్రేక్షకులు మాత్రమే కాకుండా, టాలీవుడ్ మొత్తం ఈ చిత్రం వైపు చూస్తోంది.