లూసీఫర్ చిత్రం లో కీలక పాత్ర లో త్రిష..?

Monday, February 22nd, 2021, 12:51:03 PM IST

మెగాస్టార్ చిరంజీవి వరుస చిత్రాలు చేస్తున్నారు. మలయాళం లో సూపర్ హిట్ సాధించిన లూసీ ఫర్ చిత్రం రీమేక్ రైట్స్ ను రామ్ చరణ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి సరసన నయనతార నటించాల్సి ఉండగా, పలు కారణాల వలన సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. లూసీ ఫర్ లో నయనతార పాత్ర పై ఎన్నో వార్తలు రాగా, తాజాగా ఇప్పుడు తప్పుకున్నట్లు తెలుస్తోంది.అయితే మంజు వారియర్ పాత్ర లో ప్రముఖ నటి త్రిష నటించేందుకు సిద్దం అయినట్లు తెలుస్తోంది. కథ విన్న త్రిష డేట్స్ కోసం సంతకం కూడా చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి తో స్టాలిన్ లో నటించిన త్రిష, ఆచార్య చిత్రం లో కూడా హీరోయిన్ గా చేయాల్సి ఉంది. పలు కారణాల వలన సినిమా నుండి తప్పుకుంది. అయితే లూసీ ఫర్ లో త్రిష నటించేందుకు సిద్దం కావడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే మోహన్ రాజా దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం వచ్చే నెల నుండి సెట్స్ మీదికి వెళ్ళే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆచార్య చిత్రం షూటింగ్ కూడా చివరకు చేరడం తో ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.