కేజీఎఫ్ చాప్టర్ 2 టీజర్ పై మరింత ఆసక్తి రేపుతోన్న సరికొత్త పోస్టర్

Tuesday, January 5th, 2021, 02:22:58 PM IST

ఒక కన్నడ సినిమాను పలు బాషల్లో విడుదల చేసి, ఘన విజయం సాధించిన చిత్రం గా కేజీఎఫ్ చరిత్రలో నిలిచింది. మునుపెన్నడూ కూడా కన్నడ సినిమా అంటే అంతగా చిత్ర పరిశ్రమ పట్టించుకోనేది కాదు. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ కేజీఎఫ్ చిత్రం ప్రేక్షక లోకాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేయడం మాత్రమే కాకుండా, హీరోయిజం ను పీక్స్ లో చూపించిన చిత్రం గా కూడా నిలిచింది. అయితే ఈ చిత్రం కి సంబంధించి చాప్టర్ 2 విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్.

అయితే కేజీఎఫ్ చాప్టర్ 2 టీజర్ ను జనవరి 8 ఉదయం 10:18 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే నేడు కూడా చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఇంకా టీజర్ కి మూడు రోజుల సమయం మాత్రమే అంటూ చెప్పుకొచ్చింది. ఇండియా లోనే అతి పెద్ద క్రిమినల్ అంటూ రాఖీ ను రమీక సేన్ కే జీ ఎఫ్ మొదటి భాగం చివరలో చూపిస్తారు. ఆ సీన్ కి సంబంధించిన పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే ఈ చిత్రం లో అధీరా పాత్ర లో సంజయ్ దత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరీ మధ్య వచ్చే సన్నివేశాలు, ఫైట్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే టీజర్ ను కూడా హైలెట్ సీన్స్ తో ఫ్రేమ్ చేసి ఉంచినట్లు పలువురు అంటున్నారు. నిన్న మాస్ యశ్ పోస్టర్ ను విడుదల చేయగా, నేడు ఈ పోస్టర్. ఈ చిత్రం పై అంచనాలు భారీగా ఉన్నాయి.

మొదటి సారి ఒక టీజర్ కోసం, అది కూడా కన్నడ సినిమా కోసం సౌత్ ఇండియా మాత్రమే కాకుండా, భారత్ మొత్తం ఎదురు చూస్తుంది అని చెప్పాలి. ఈ చిత్రం ను వచ్చే సమ్మర్ కి విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ చిత్రం లో యశ్ సరసన కథానాయికగా శ్రీనిధి శెట్టి నటిస్తుండగా, సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్, పలువురు ప్రముఖులు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.