హాట్ న్యూస్ : కరోనాపై అద్భుత ఫలితాన్ని ఇస్తున్న మన దగ్గర ఈ మెడిసిన్..!

Saturday, July 11th, 2020, 12:44:52 PM IST

ప్రస్తుతం ప్రపంచ దేశాలు అన్నీ ఒకపక్క కరోనా తో పోరాడుతూనే మరోపక్క కరోనాకు సరైన వాక్సిన్ ను కనుక్కొనే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఈ అంతు చిక్కని వైరస్ కు మందు మాత్రం ఇంకా ఎవరూ కనుక్కోలేక పోతున్నారు. ఇదిలా ఉండగా దీనిని తగ్గించడానికి మాత్రం మన దేశపు వైద్యులు మరియు శాస్త్రవేత్తలు నిరంతరం శ్రామిస్తూనే ఉన్నారు.

అందులో భాగంగా కరోనాకు నియంత్రించే కొన్ని మెడిసెన్స్ ను కూడా ఈ క్రమంలోనే కనుక్కొన్నారు. ఇప్పుడు మన దేశపు వైద్యులు మరియు శాస్త్రవేత్తలు మరో గుడ్ న్యూస్ చెప్పారు. డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా వారు కరోనా సోకిన రోగులకు సొరియాసిస్ కు అందించే మెడిసిన్ “ఇటోలీజుమ్యాజ్” ను వింయోగించవచ్చని తెలిపారు. ఇందులో ఉండే యాంటీ బాడీస్ కరోనా తో సమర్ధవంతంగా పోరాడుతున్నాయి అని ఇటీవలే ముంబై ఓ ఆసుపత్రి వారు తెలిపారు.

ఈ మెడిసిన్ ను ఉత్పత్తి చేస్తున్న మన దేశపు బయో కాన్ సంస్థ వారు ఈ మందును ఉచితంగా ఆసుపత్రులకు అందించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ మందు వ్యాధి గ్రస్థులకు వారి సమ్మటంతోనే అందించడం జరుగుతుంది అందించడం జరుగుతుంది అని తెలిపారు. అంతే కాకుండా వ్యాధి తీవ్రతను అనుసరించి ఒక డోస్ నుంచి మూడు డోస్ ల వరకు ఇవ్వగా వారికి పూర్తిగా తగ్గుతుంది అని తెలిపారు.