దేవాలయాలపై ఆగని దాడులు.. మరో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం..!

Wednesday, September 23rd, 2020, 11:47:47 AM IST

ఏపీలో హిందూ దేవాలయాలపై, దేవుళ్ల విగ్రహాలపై జరుగుతున్న వరుస దాడులు ఆగడం లేదు. అంతర్వేది రథం, కనకదుర్గమ్మ వెండి రథం సింహాలు మాయమవ్వడం మొదలుకుని ఏదో ఓ చోట దేవాలయాలపై దాడులు, విగ్రహాలు ధ్వంసమైన ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా కర్నూల్ జిల్లాలో మరో సంఘటన వెలుగులోకి వచ్చింది.

పత్తికొండ మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నిన్న రాత్రి దుండగులు పెకిలించి పక్కన పడేశారు. అయితే ఉదయం దీనిని గమనించిన స్థానికులు పొలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై స్థానికులు, బీజేపీ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే కాదు కాకినాడలో ఏసు ప్రభువు విగ్రహాన్ని కూడా దుండగులు కూల్చినట్టు సమాచారం.