ఏపీలో మరో సంఘటన.. ఆంజనేయ స్వామి విగ్రహం ద్వంసం..!

Friday, September 25th, 2020, 01:14:53 PM IST

ఏపీలో హిందూ దేవాలయాలపై, దేవుళ్ల విగ్రహాలపై జరుగుతున్న వరుస దాడులు ఆగడం లేదు. అంతర్వేది రథం, కనకదుర్గమ్మ వెండి రథం సింహాలు మాయమవ్వడం మొదలుకుని ఏదో ఓ చోట దేవాలయాలపై దాడులు, విగ్రహాలు ధ్వంసమైన ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది.

అయితే నాయుడుపేట నగర పంచాయతీలోని తుమ్మూరు ప్రాంతంలో ఏడడుగుల ఆంజనేయస్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఆంజనేయ స్వామి విగ్రహం తల, తోక భాగంలో దెబ్బతింది. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.