తండ్రి బాటలోనే జగన్..రైతన్నలకు మరో గుడ్ న్యూస్..!

Saturday, August 1st, 2020, 09:59:04 AM IST

దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం పై ఎన్ని విమర్శలు ఉన్నా సరే అది రైతన్నలకు మేలు చేసే ప్రభుత్వం అని తరాలు మారినా చెప్పుకునే మాట. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు అదే బాటలో ఆయన తనయుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రైతులకు అండగా నిలిచే నేతగా మరింత చేయూతను ఇస్తున్నారు. ఇప్పటికే వారి సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టిన వై ఎస్ జగన్ ఇప్పుడు ఇప్పుడు వారికి మరో గుడ్ న్యూస్ అందించారు.

వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం అలాగే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకుని వారు వ్యవసాయానికి కొనుగోలు చేసే పరికారల్లో ఏకంగా 40 శాతం ప్రభుత్వం తరపున రాయితీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఓ పరికరం విలువలో సంఘాలు వారు 10 శాతం సమకూర్చుకుంటే గ్రామీణ బ్యాంకు వారు 50 శాతానికి రుణం ఇస్తారని అందులో మిగతా 40 శాతం ఏపీ ప్రభుత్వం అందిస్తుంది అని సమాచారం.అలాగే ఈ రుణాలకు అర్హులు అంతా ఈ ఆగష్టు 15 లోగ దరఖాస్తు చేసుకోవాలి అని ప్రభుత్వం వారు సూచించారు.