ఏపీలో మరో గ్యాస్ లీకేజ్ ఘటన.. ఐదుగురి పరిస్థితి విషమం..!

Friday, August 21st, 2020, 07:20:26 AM IST

ఏపీలో వరుస గ్యాస్ లీకేజ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. మొన్నటి వరకు విశాఖలో జరిగిన ప్రమాదాలను మరిచిపోకముందే తాజాగా చిత్తూర్‌లో మరో సంఘటన వెలుగు చూసింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం బందపల్లిలోని హాట్సన్ డెయిర్ ఫాంలో అమోనియా గ్యాస్ లీక్ అయ్యింది.

అయితే ఈ ఘటనలో 25 మంది అస్వస్థతకు గురైనట్టు సమాచారం. అయితే డైరీ ప్లాంట్‌లో గ్యాస్ లీక్ ఘటన ఎలా జరిగిందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించినట్టు తెలిసింది. గ్యాస్ లీక్ అయిన ప్రైవేట్ పాల డెయిరీని చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్ పరిశీలించారు.