విశాఖలో మరో అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు..!

Monday, July 27th, 2020, 04:19:50 PM IST

ఏపీ పరిపాలన రాజధాని విశాఖను వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల ఎల్జీ పాలిమర్స్, సాయినార్ కెమికల్స్ గ్యాస్ లీకేజ్‌లు సృష్టించిన తీవ్రత నుంచి కోలుకోకముందే మొన్న పరవాడలోని రాంకీ సీఈటీపీ సాల్వెంట్స్‌లో భారీ పేలుడు సంభవించింది. అయితే తాజాగా గాజువాక సమీపంలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

గేట్‌వే ఈస్ట్ ఇండియా కంటైనర్స్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చూస్తుండగానే కంటైనర్లలో ఉన్న బల్క్ కెమికల్స్ దగ్ధం అయ్యాయి. దీంతో మంటలు ఎగిసిపడి దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ప్రజలు మరోసారి భయాందోళనకు గురయ్యారు. అయితే వెంటనే రంగంలోకి దిగిన రెండు ఫైరింజన్లు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.