చైనాలో విజృంభిస్తున్న మరో అంటువ్యాధి.. మనుషుల నుంచి మనుషులకు..!

Monday, July 6th, 2020, 08:18:48 AM IST

ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నిటిని వణికిస్తున్న కరోనా మహమ్మారి పుట్టినిల్లు చైనా ఇప్పుడు అనేక రకాల వైరస్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఇప్పటికే కరోనా సృష్టిస్తున్న విద్వంసాన్ని తట్టుకోలేక చాలా దేశాలు కొట్టుమిట్టాడుతుంటే తాజాగా మరికొన్ని వైరస్‌లు కలకలం రేపుతున్నాయి.

అయితే చైనా నుంచి ఇటీవల జీ4 వైరస్ బయటకు రాగా తాజాగా “బుబోనిక్ ప్లేగు” వైరస్ ఉత్తర చైనాలో వ్యాపిస్తుంది. దీంతో ఆ ప్రాంతంలో ఈ ఏడాది వరకు మూడో దశ హెచ్చరికలు జారీ చేశారు. అయితే మర్మోట్ జాతికి చెందిన ఎలుకను తిన్న ఇద్దరికి ఈ ఇన్‌ఫెక్షన్ సోకినట్టు గుర్తించారు. ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని జ్వరం, తలనొప్పి, చలి, వాపులు, పుండ్లు ఈ వ్యాధి లక్షణాలని వైద్యులు తెలిపారు.