బిగ్ న్యూస్ : విశాఖలో డేంజర్ బెల్స్..మరో దిగ్భ్రాంతి గొల్పే ఘటన.!

Saturday, August 1st, 2020, 03:18:32 PM IST

గత కొన్ని రోజుల కితం ఏపీ సరికొత్త రాజధాని విశాఖపట్నంలో ఎల్ పాలిమర్స్ పరిశ్రమ నుంచి స్టెరిన్ గ్యాస్ లీకయ్యి ఎంతో మంది మృత్యువాత పడిన సంఘటన ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఇదే అనుకుంటే ఆ తర్వాత మళ్ళీ విశాఖలోనే భారీ అగ్ని ప్రమాదం జరగడం మరోసారి కలకలం రేపింది.

అయితే ఇవి మర్చిపోయే లోపే మరో భారీ పెను ప్రమాదం విశాఖ వాసులను ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈసారి విశాఖ హిందుస్థాన్ షిప్ యార్డ్ లో చూస్తుండగానే భారీ క్రేన్ నెలకొరిగిపోవడం ఒక్కొక్కరికి గగుర్పొడిచింది. ఈ ఘటన జరిగిన సమయంలో మొత్తం 10 మంది అక్కడిక్కడే మృతి చెందడం చాలా బాధాకరం.

అలాగే దీని కిందే మరో ముప్పై మందికి పైగా ఇరుక్కుపోయినట్టు తెలుస్తుంది. ఈ ఘటనపై ఇప్పటికే ప్రతిపక్ష నేతలు జగన్ ప్రభుత్వం వారిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తుండగా ఈ ప్రమాదంపై ఆరా తీసి వివరాలను జగన్ తెలుసుకున్నారట, అలాగే తక్షణమే దీనిపై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ యంత్రాంగానికి సూచించారు.